
చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వంలో యష్ రంగినేని నిర్మిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. శుక్రవారం ఈ మూవీ టీజర్‌ను మారుతి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘చెందు తీసిన ‘ఓ పిట్ట కథ’ చిత్రం స్కీన్ ప్లే, వర్కింగ్ స్టైల్ నన్ను ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాను కూడా 80, 90 బ్యాక్ డ్రాప్ లో నేటివిటీ ఎక్కడా మిస్ కాకుండా యూనిక్‌గా తీశాడు. టీజర్ చూస్తే ఇదొక క్వాలిటీ ఫిల్మ్ అనిపిస్తోంది’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ మంచి కథను ఆసక్తికర కథనంతో, చక్కని సంగీతంతో, అందమైన లొకేషన్స్‌లో తీశాం. సరికొత్త స్క్రీన్ ప్లేను ఇందులో చూస్తారు. జులై 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. తప్పకుండా కొత్త అనుభూతిని పంచే చిత్రమవుతుంది’ అని చెప్పాడు. ‘కోనసీమ, కేరళలోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. పాటల తరహాలోనే టీజర్‌ను హిట్ చేస్తారని కోరుకుంటున్నాం’ అని హీరోహీరోయిన్స్ అన్నారు.