V6 News

తమన్నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా.. బాలీవుడ్ సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!

తమన్నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా.. బాలీవుడ్ సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ నటుడు అన్ను కపూర్ మరో సారి వార్తల్లో నిలుచారు. గతేడాది తమన్నా భాటియాపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఒక ఇంటర్వ్యూలో ఆ వివాదంపై స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన ఇచ్చిన వివరణ నెట్టింట వైరల్ అవుతోంది.

అసలేం జరిగింది?

2025లో శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అన్ను కపూర్, 'స్త్రీ-2' చిత్రంలోని 'ఆజ్ కీ రాత్' పాట గురించి మాట్లాడుతూ తమన్నా అందాన్ని ఉద్దేశించి 'మాషా అల్లా.. క్యా దూధియా బదన్ హై' (వావ్.. ఎంత తెల్లని శరీరం) అని వ్యాఖ్యానించారు. ఈ పదం వినడానికి అసభ్యంగా ఉందని, ఒక సీనియర్ నటుడు అయ్యి ఉండి ఇలాంటి వర్ణనలు చేయడం ఏంటని నెటిజన్లు అప్పట్లో తీవ్రంగా మండిపడ్డారు.

ఇంగ్లీష్‌ అయితే ఓకేనా?

లేటెస్ట్ గా సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ను కపూర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. నేను అమెరికాలో షోలు చేస్తున్నప్పుడు ఆ పాట చూశాను. ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అది కేవలం ఒక ప్రశంస మాత్రమే. ఒకవేళ నేను అదే మాటను ఇంగ్లీష్‌లో 'మిల్కీ బాడీ' అని అంటే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ హిందీలో 'దూధియా బదన్' అనగానే అందరికీ కోపం వచ్చింది. మన భాషలో తిడితేనే ఎక్కువగా నొప్పి కలుగుతుంది, అదే ఇంగ్లీష్‌లో అంటే ఎవరూ పట్టించుకోరు అని ఆయన అభిప్రాయపడ్డారు.

ALSO READ : నవ్విస్తూనే ఎమోషనల్ చేసే కథ..

క్షమాపణకు సిద్ధం

తమన్నా వయసు 28 లేదా 30 ఉండొచ్చు. నా పిల్లల వయసు కూడా అంతే. నన్ను ముసలాడిని చేస్తూ ట్రోల్ చేస్తున్నారు కానీ, నేను తప్పుడు ఉద్దేశంతో అనలేదు అని ఆయన వాపోయారు. అందాన్ని ఆస్వాదించడం అంటే కోరుకోవడం కాదని చెప్పారు. రోల్స్ రాయిస్ కారును చూసి మురిసిపోయినంత మాత్రాన అది కావాలని అనుకోం కదా అని వింత పోలిక తెచ్చారు. ఒకవేళ తన మాటల వల్ల తమన్నా బాధపడి ఉంటే, ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడానికైనా తాను సిద్ధమని, తన మనసులో ఎలాంటి కల్మషం లేదని అన్ను కపూర్ స్పష్టం చేశారు.

అన్ను కపూర్ గతంలోనూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు. గతంలో 'అనిమల్' సినిమాపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పెరిగాక సెలబ్రిటీల ప్రతి మాటను  ప్రజలు గమనిస్తున్నారు. ఉద్దేశం కంటే ప్రభావం ముఖ్యం అన్న పాయింట్‌పై నెటిజన్లు ఆయన్ని విమర్శిస్తున్నారు. 71 ఏళ్ల నటుడి వివరణ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతుందో లేక మళ్ళీ చర్చకు దారితీస్తుందో చూడాలి..