
- సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్
గ్యాంగ్‌టక్: ప్రభుత్వ ఉద్యోగులు పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్లు ఇస్తామని ఇటీవల చెప్పిన సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్.. తాజాగా మహిళా ఉద్యోగుల కోసం మరో ప్రకటన చేశారు. ఉద్యోగుల చిన్న పిల్లల్ని సంరక్షించేందుకు చైల్డ్ కేర్ అటెండెంట్లను నియమిస్తామని తెలిపారు. ఈ సేవలను ఉద్యోగులకు ఉచితంగా అందిస్తామని, చైల్డ్ కేర్ అటెండెంట్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని చెప్పారు.
గ్యాంగ్‌టక్‌లోని సరమ్స గార్డెన్‌లో తమాంగ్ మాట్లాడుతూ.. 40 ఏండ్లు పైబడిన మహిళలను రిక్రూట్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. మహిళా ఉద్యోగుల చిన్న పిల్లల్ని చూసుకునేందుకు వీరిని నియమిస్తామని వివరించారు.