ఉక్రెయిన్ ప్రెసిడెంట్ హత్య కుట్ర భగ్నం!

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ హత్య కుట్ర భగ్నం!

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని హత్య చేసేందుకు రష్యన్ స్పెషల్ సర్వీసెస్ చేసిన కుట్రను ఉక్రెయిన్ బలగాలు భగ్నం చేశాయి. రష్యన్ స్పెషల్ సర్వీసెస్ కు చెందిన 25 మంది మిలిటరీ గ్రూప్ ను అరెస్ట్ చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారని ఆ దేశ మీడియా సంస్థ ది కీవ్ పోస్ట్ పేర్కొంది.

‘‘ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని హత్య చేసేందుకు జరిగిన మరో కుట్రను భగ్నమైంది. రష్యా స్పెషల్ సర్వీసెస్ కు చెందిన 25 మంది మిలిటరీ గ్రూప్ సభ్యులను స్లోవేకియా, హంగేరి సరిహద్దు వద్ద ఉక్రెయిన్ బలగాలు అరెస్ట్ చేశాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చంపేయాలన్న లక్ష్యంతో వాళ్లు వస్తుండగా పట్టుకున్నారు’’ అని ది కీవ్ పోస్ట్ ట్వీట్ చేసింది. కాగా, ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలైన రోజు నుంచీ జెలెన్స్కీ ఒకే మాట చెబుతున్నారు. తనను చంపడమే రష్యా అధ్యక్షుడు పుతిన్ టార్గెట్ అని ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం..

చినజీయర్ లేకుండానే యాదాద్రి పున: ప్రారంభం

యాదగిరిగుట్ట కేసీఆర్ సొంత ఆస్తి కాదు

దేశాన్ని కలపాలనుకుంటే RRR చూడండి