దేశాన్ని కలపాలనుకుంటే RRR చూడండి

దేశాన్ని కలపాలనుకుంటే RRR చూడండి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై  కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రశంసలు కురిపించారు. దేశాన్ని ఐక్యం చేయాలంటే ఈ చిత్రాన్ని వీక్షించాలన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని థియేటర్ లో చూసిన వీడియోను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘మీరు భారత్ ను విడదీయాలనుకుంటే కశ్మీర్ ఫైల్స్ చూడండి. దేశాన్ని కలపాలనుకుంటే ఆర్ఆర్ఆర్ వీక్షించండి. ఈ సినిమాకు అన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఇవ్వాలి. రాజమౌళికి నా అభినందనలు. తారక్, చరణ్ అద్భుతంగా నటించారు’ అని సీతక్క ట్వీట్ చేశారు.

మంచి టీమ్ ఎఫర్ట్ కు ఈ చిత్ర విజయం నిదర్శనమన్నారు. మొత్తం సినిమాలో ‘కొమురం భీముడో’ తన ఫేవరెట్ సాంగ్ అని పేర్కొన్నారు. హిందూ, ముస్లిం అనే తేడాల్లేకుండా కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వ్యక్తిగత అవసరాలు, స్వార్థం కోసం జనాలను విడదీయొద్దన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

రూ.500 కోట్ల క్లబ్లో RRR 

యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు