రూ.500 కోట్ల క్లబ్లో RRR 

రూ.500 కోట్ల క్లబ్లో RRR 

హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తొలిరోజు వసూళ్లలో బాహుబలి–2 రికార్డులను చెరిపేసిన ఆర్ఆర్ఆర్.. కలెక్షన్లలో కొత్త బెంచ్మార్క్స్ సెట్ చేస్తోంది. గత శుక్రవారం రిలీజైన ఈ మూవీ.. అప్పుడే ఐదొందల కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి వరల్ద్వైడ్గా రూ.500 కోట్లకు పైచిలుకు కలెక్షన్లతో చరిత్ర సృష్టించింది. 

హిందీ బెల్ట్ లోనూ ఆర్ఆర్ఆర్ సత్తా చాటుతోంది. మూడ్రోజుల్లో రూ.74.50 కోట్ల వసూళ్లు సాధించింది. ఆదివారం ఒక్కరోజే రూ.31.50 కోట్లు కలెక్ట్ చేసింది. కరోనా ఎరాలో బాలీవుడ్ లో ఇంతస్థాయి డే కలెక్షన్ సాధించిన చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రం తర్వాతి స్థానాల్లో అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ (రూ.26.94 కోట్లు), రణ్ వీర్ సింగ్ ‘83’ (రూ.17.41 కోట్లు) ఉన్నాయి.

ఈ విషయాన్ని ప్రముఖ మూవీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోందని.. భారతీయ సినిమా గౌరవాన్ని రాజమౌళి పెంచారని ఆయన ట్వీట్ చేశారు. నాన్ హాలీడే సీజన్ లో రిలీజై ఈ సినిమా దిగ్విజయంగా రన్ ను కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం:

యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో