చినజీయర్ లేకుండానే యాదాద్రి పున: ప్రారంభం

చినజీయర్ లేకుండానే యాదాద్రి పున: ప్రారంభం

యాదాద్రి పునర్ నిర్మాణానికి మూహుర్తం పెట్టిన చినజీయర్... లేకుండానే దేవాలయ పున:ప్రారంభం జరిగింది. పిలిస్తే వెళ్తా.. లేకుంటే చూసి ఆనందిస్తానని చినజీయర్ స్వామి చెప్పినా.. తమ మధ్య గ్యాప్ వచ్చిందని ఎవరన్నారని కేసీఆర్ ప్రశ్నించినా.. ఇద్దరి మధ్య ఏదో జరిగిందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. ప్రారంభోత్సవ మూహుర్తం కూడా స్వామిజీ చెప్పినట్టే జరిగింది. స్వామి పెట్టిన మూహుర్తానికే ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుందని సాక్షాత్తూ అధికారులే.. అధికారికంగా చెప్పుకొచ్చారు. ప్రారంభోత్సవానికి మాత్రం చినజీయర్ కు ఆహ్వానం అందకపోవడంపై చర్చ జరుగుతోంది. సమతామూర్తి విగ్రహావిష్కరణలో యాక్టివ్ గా ఉన్న కేసీఆర్.. చాలా సార్లు పనులను కూడా పరిశీలించారు. అయితే ప్రధాని మోడీ పర్యటన తర్వాత పరిస్థితులు మారిపోయాయని ప్రచారం జరుగుతోంది.

 

ఇండియా.. ఇంటికే

యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు