
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆలియా భట్ చక్రం తిప్పుతోంది. గంగూబాయ్ కథియావాడి, బ్రహ్మాస్త్ర, డార్లింగ్స్, రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోందామె. ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్టును కూడా బ్యాగ్‌లో వేసుకున్నట్లు తెలిసింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘బైజు బావ్‌రా’ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. ఇందులో హీరోయిన్‌గా మొదట దీపికా పదుకొనె పేరు వినిపించింది. కానీ చివరికి ఆలియా ఫిక్సయ్యిందంటూ బీటౌన్ నుంచి కబురందింది. ఇదొక మ్యూజికల్ లవ్‌స్టోరీ. ఆల్రెడీ గంగూబాయ్‌గా ఆలియా పర్‌ఫార్మెన్స్ చూసి ఉండటంతో ఏరి కోరి ఈ మూవీకి కూడా తీసుకున్నాడట భన్సాలీ. ఇప్పుడు సౌత్‌లోనూ ఆలియా హవా మొదలయ్యింది. ఆల్రెడీ ‘ఆర్‌ఆర్‌ఆర్’లో సీతగా నటిస్తోంది. రీసెంట్గా ఎన్టీయార్, కొరటాల శివల చిత్రంలోనూ ఫిమేల్ లీడ్‌గా కన్‌ఫర్మ్ అయ్యిందని సమాచారం. ఇది ఎన్టీఆర్‌కి ముప్ఫయ్యో సినిమా. అక్టోబర్‌లో సెట్స్‌కి వెళ్లబోతోంది. ఆలోపు ఆలియా విషయంలో క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. మొత్తానికి అటు నార్త్‌లోనూ ఇటు సౌత్‌లోనూ కూడా క్రేజీ ప్రాజెక్టులకి ఆలియా ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కావడం విశేషమే.