25 ఆన్ లైన్ లోన్ల యాప్ లపై కేసులు

25 ఆన్ లైన్ లోన్ల యాప్ లపై కేసులు

ఆన్ లైన్ లోన్ యాప్ ల వేధింపులకు మరొకరు బలయ్యారు. మొన్న సిద్దిపేట జిల్లాకు చెందిన AEO మౌనిక ఆత్మహత్య చేసుకోగా, నిన్న హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. మొదట ఒక అప్పు తీసుకున్న అతను… దాన్ని తీర్చడానికి మరో యాప్ లో లోన్ తీసుకున్నాడు.  అలా 25 యాప్స్ లో లోన్లు తీసుకని, అప్పుల ఊబిలోకి చిక్కుకుపోయి ప్రాణాలు తీసుకున్నాడు.

రాజేంద్రనగర్ కిస్మాత్ పూర్ కు చెందిన సునీల్….  ఓ యాప్ ద్వారా 70 వేలు తీసుకున్నాడు. దీన్ని తీర్చడానికి మరో యాప్ లో అప్పు తీసున్నాడు. అప్పులు కట్టకపోవడంతో యాప్ లోన్ ప్రతినిధులు సునీల్  తో పాటు ఆయన తల్లికి ఫోన్ చేసి బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతను ఇంట్లో  ఊరి వేసుకొని చనిపోయాడు. లోన్ యాప్ ప్రతినిధుల వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేశారు సునీల్ భార్య రమ్య. ఆమె ఫిర్యాదుతో 25 యాప్ లపై కేసులు నమోదు చేశామన్నారు పోలీసులు

మొన్న ఆన్ లైన్ లోన్ యాప్ ల వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంది సిద్దిపేట జిల్లా రాజగోపాలపేటకు చెందిన ఏఈవో మౌనిక. తండ్రి వ్యాపారాల్లో నష్టపోవడంతో కుటుంబ అవసరాల కోసం ఆమె ‘స్నాప్ ఇట్ లోన్ ’ యాప్ నుంచి రెండు నెలల కిందట 3 లక్షల అప్పు తీసుకుంది. గడువులోగా లోన్ డబ్సులు చెల్లించలేదని…. మౌనిక ఫోన్ లోని కాంటాక్టు నంబర్లన్నింటికీ డిఫాల్టర్ అంటూ వాట్సప్ మేసేజ్ లు పంపారు యాప్ నిర్వాహకులు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె.. ఈ నెల 14న ఇంట్లో  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఆన్ లైన్ లోన్ యాప్ లపై జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. యాప్ ల ప్రతినిధులు వేధిస్తే, ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.