డ్రాగన్ డైరెక్టర్ నుంచి మరో సినిమా.. హారర్ థ్రిల్లర్ షురూ

డ్రాగన్ డైరెక్టర్ నుంచి మరో సినిమా.. హారర్ థ్రిల్లర్ షురూ

కన్నడ దర్శకుడు ప్రశాంత్‌‌ నీల్‌‌ డైరెక్షన్‌‌లో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్‌‌’ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌‌ సంస్థ...  ఇదే దర్శకుడితో మరో సినిమాకు ప్లాన్ చేసింది.  ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో మైత్రి సంస్థ ఓ సినిమా నిర్మిస్తోంది. సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల లీడ్ రోల్స్‌‌లో రూపొందనున్న ఈ హారర్‌‌‌‌ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. 

భయంతో కూడిన ఓ గ్రామం, అక్కడి మెడికల్‌‌ కాలేజ్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ సినిమా ఉండబోతోంది. సైన్స్‌‌,  మూఢనమ్మకాల నేపథ్యంలో ఓ అంతు చిక్కని రహస్యంతో కూడిన సరికొత్త కథతో ప్రేక్షకులను ఈ చిత్రం థ్రిల్ చేయబోతోందని మేకర్స్‌‌ ఈ సందర్భంగా తెలియజేశారు.   

శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మోహన్ బి.ఎస్ డైలాగ్స్ రాస్తుండగా అనిల్ యెర్నేని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా, దినేష్ దివాకరన్ డీవోపీగా, వెంకీ జి  మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో షూటింగ్  ప్రారంభం కానుంది.