వరుణ్ తేజ్, క్రిష్​ కాంబినేషన్లో కామెడీ డ్రామా మూవీ

వరుణ్ తేజ్, క్రిష్​ కాంబినేషన్లో కామెడీ డ్రామా మూవీ

వరుణ్ తేజ్, క్రిష్​ కాంబినేషన్ అనగానే ‘కంచె’ సినిమా గుర్తొస్తుంది. వీళ్లిద్దరి కాంబోలో ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. అయితే క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం లేదు. కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డితో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.  కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కే ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘అంతరిక్షం’ చిత్రానికి కూడా క్రిష్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ అనే పీరియాడిక్ మూవీలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్.  మరోవైపు తనకు ‘ఫిదా’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఓ సినిమా చేయనున్నాడు వరుణ్ తేజ్. ధనుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శేఖర్ కమ్ముల తీస్తున్న ‘కుబేర’ పూర్తయ్యాక ఇది పట్టాలెక్కనుంది.