న్యూ జ‌‌‌‌న‌‌‌‌రేష‌‌‌‌న్‌‌‌‌ని ప్రోత్సహించేందుకు మరో కొత్త ఓటీటీ

న్యూ జ‌‌‌‌న‌‌‌‌రేష‌‌‌‌న్‌‌‌‌ని ప్రోత్సహించేందుకు మరో కొత్త ఓటీటీ

నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌ మొదలు ఆహా వరకూ ఇప్పటికే చాలా ఓటీటీ సంస్థలున్నాయి. ఇప్పుడీ వరుసలో ‘సన్‌‌‌‌షైన్ ఓటీటీ’ కూడా చేరింది. త్వరలో తెలంగాణ ఫిలిం చాంబర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఈ తెలుగు ఓటీటీని ప్రారంభించబోతున్నారు. నిన్న హైదరాబాద్‌‌‌‌లో లోగోని లాంచ్ చేశారు. సన్‌‌‌‌షైన్ సంస్థ సీఎండీ బొల్లు నాగ శివ ప్రసాద్ చౌదరి మాట్లాడుతూ ‘అన్ని భాషల చిత్రాల్నీ మా ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నాం. ఇప్పటికే వెయ్యికి పైగా చిత్రాలు తీసుకున్నాం. ఒరిజినల్ కంటెంట్ కూడా ఉంది. న్యూ జ‌‌‌‌న‌‌‌‌రేష‌‌‌‌న్‌‌‌‌ని ప్రోత్సహిస్తూ షార్ట్‌‌‌‌ ఫిల్మ్ కాంటెస్ట్‌‌‌‌ నిర్వహించబోతున్నాం. అన్ని వయసుల వారికీ నచ్చే కంటెంట్‌‌‌‌ని అందించాలన్నదే మా లక్ష్యం. త్వరలోనే గ్రాండ్‌‌‌‌గా లాంచ్‌‌‌‌ చేయనున్నాం’ అన్నారు.

టీఎఫ్‌‌‌‌పీసీ చైర్మన్‌‌‌‌ ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘రిలీజ్ విషయంలో ఇబ్బంది పడుతున్న చిన్న చిత్రాల నిర్మాతలందరికీ అందుబాటులో ఉండేలా సన్‌‌‌‌ షైన్ ఓటీటీ రావడం సంతోషం. ప్రతి నిర్మాతకీ తన సినిమాని తాను అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి. నిర్మాతలకి అసోసియేషన్లు కండిషన్స్ పెట్టడం సరి కాదు. ఒకవేళ అలా పెడితే రిలీజ్‌‌‌‌కి థియేటర్స్‌‌‌‌ కూడా పర్సంటేజ్ విధానంలో ఇవ్వాలి’ అన్నారు. టీఎఫ్‌‌‌‌సీసీ వైస్ ఛైర్మన్ ఎ.గురురాజ్,  నిర్మాత త‌‌‌‌రుణీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.