స్టేట్​లో మరో కొత్త పార్టీ

V6 Velugu Posted on Oct 28, 2021

హైదరాబాద్, వెలుగు: త్వరలో కొత్త పార్టీ పెడతానని కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్​ కొడుకు డాక్టర్ వినయ్ కుమార్​ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్​లో ఉన్నారు. బుధవారం సిటీలోని ఓ ఫంక్షన్​ హాల్​లో తన సన్నిహితులతో సమావేశమై ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం విద్య, హెల్త్ సెక్టార్లను నిర్వీర్యం చేసిందని, ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆయన కాంగ్రెస్​ను వీడుతున్నట్లు ప్రకటించారు. వినయ్ కుమార్​ గతంలో ముషీరాబాద్​ నుంచి కాంగ్రెస్​అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్​లో బీసీ నేతల్ని ఏకం చేసేందుకు కూడా ఆయన గతంలో ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేసి మీటింగ్​లు పెట్టారు. అయితే ప్రస్తుతం ఏ ఎజెండాతో ముందుకు వస్తున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 

Tagged Telangana, POLITICS, new party,

Latest Videos

Subscribe Now

More News