వాట్సాప్​లో మరో పెగాసస్

వాట్సాప్​లో మరో పెగాసస్

ఎంపీ4  వీడియోలతో చొరబడుతున్న హ్యాకర్లు

మొన్నటికిమొన్న వాట్సాప్​తో పెగాసస్​ అనే స్పైవేర్​ (నిఘా వైరస్​) కొందరు ప్రముఖులపై గూఢచర్యం చేసింది. అది పెద్ద దుమారాన్నే రేపింది. ఇప్పుడు దాని బాటలోనే ఎంపీ4 ఫైల్​ ఫార్మాట్​లో వీడియోలను పంపి రిమోట్​ అటాకర్లు ఫోన్లను హ్యాక్​ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇండియన్​ కంప్యూటర్​ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్​ (సెర్ట్​) వెల్లడించింది. ముప్పును ‘హై సివియారిటీ– (అత్యంత తీవ్రం)’ కింద పరిగణించింది. ‘‘వాట్సాప్​ యూజర్లకు ఎంపీ4 ఫైల్​ ద్వారా వీడియోలను పంపుతూ రిమోట్​ అటాకర్​లు ఫోన్లను హ్యాక్​ చేస్తున్నారు. బఫర్​ ఓవర్​ఫ్లో ద్వారా అటాకర్లు​ ఫోన్​లోకి కోడ్​ను పంపి చొరబడుతున్నారు. యూజర్​ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే డేటాను తీసుకుంటున్నారు” అని హెచ్చరించింది. ఆండ్రాయిడ్​  2.19.274, ఐవోఎస్​2.19.100 వెర్షన్ల వాట్సాప్​పై ప్రభావం పడిందని, విండోస్​ వాట్సాప్​, వాట్సాప్​ బిజినెస్​లూ ఎఫెక్ట్​ అయ్యాయని వెల్లడించింది.

Another Pegasus-like spyware found targeting WhatsApp with MP4 files