యూఎస్‎లో మరో విమాన ప్రమాదం.. జనవాసాల్లో కుప్పకూలిన ప్రైవేట్ జెట్

యూఎస్‎లో మరో విమాన ప్రమాదం.. జనవాసాల్లో కుప్పకూలిన ప్రైవేట్ జెట్

వాషింగ్టన్: అమెరికాలో ఓ ప్రైవేటు విమానం కుప్పకూలడంతో పలువురు చనిపోయారు. గురువారం తెల్లవారుజామున శాన్ డియాగో పరిసర ప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పాట్‎కు చేరుకున్నారు. విమానం కూలిపోవడంతో కింద ఉన్న ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 8 నుంచి 10 మంది ప్రయాణికులు ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతానికి ప్రయాణికుల సంఖ్యను కచ్చితంగా చెప్పలేమన్నారు. విమానం కూలి జెట్ ఫ్యూయల్ బయటికొచ్చిందని, దీంతో వీధికి ఇరువైపులా ఉన్న కార్లన్నీ దగ్ధం అయ్యాయని వివరించారు. అయితే, విమానానికి సంబంధించిన ఇతర వివరాలను అధికారులు విడుదల చేయలేదు. అది మిడ్‌‌ వెస్ట్ నుంచి వస్తున్న విమానం అని మాత్రం చెప్పారు.