మేడ్చల్ మాల్కాజ్గిరిలో బీజేపీకి మరో షాక్ .. కాంగ్రెస్ లో చేరనున్న పన్నాల హరీష్ రెడ్డి

మేడ్చల్ మాల్కాజ్గిరిలో బీజేపీకి మరో షాక్ .. కాంగ్రెస్ లో చేరనున్న పన్నాల హరీష్ రెడ్డి

మేడ్చల్ మాల్కాజ్ గిరి జిల్లాలో బీజేపీకి మరో షాక్ ..బీజేపీ మేడ్చల్  మల్కాజ్ గిరి జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి పార్టీ వీడి కాంగ్రెస్ చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నా పన్నాల హరీష్ రెడ్డి పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారని.. రెండు రోజుల్లో జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పన్నాల హరీష్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఉన్న పరిచయాలతో హరీష్ రెడ్డికి కలిసి రానుంది.  కాంగ్రెస్ పార్టీలో పన్నాల హరీష్ రెడ్డిని చేర్చుకునేందుకు కీలక నేత రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 

పొత్తుల విషయంలో రాష్ట్ర బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆపార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు.  అసెంబ్లీలో ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలనుకుంటున్నా బీజేపీ.. ఆ పార్టీకి 6 నుంచి 12 సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీలో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూకట్ పల్లి, ముషీరాబాద్ సీట్లను వదులుకునేందుకు బీజేపీ సిద్దమైంది. బీజేపీ బలంగా ఉన్న కూకట్ పల్లి సీటును జనసేనకు కేటాయించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న పన్నాల హరీష్ రెడ్డి పార్టీ నాయకత్వం నిర్ణయంపై అసంతృప్తితో పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు  తెలుస్తోంది.