పాలకవీడు, వెలుగు: పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్స్ కర్మాగారంలో 40వ గనుల భద్రత వారోత్సవాలను ఇన్స్పెక్షన్ టీం కన్వీనర్ కే. నాగతులసి రెడ్డి సోమవారం జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 10 నుంచి 15 వ తేదీ వరకు భద్రత వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
గనుల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతా పరికరాలు ధరించి, భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని సూచించారు. ప్రతి ఉద్యోగి క్రమశిక్షణను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీఎం కల్యాణ చక్రవర్తి గనిలో భద్రతాపరంగా జరిగిన అభివృద్ధి, చేపట్టిన చర్యలు వివరించారు. గని సిబ్బంది కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
