
శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’. రెబా మోనికా జాన్ హీరోయిన్. ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ఓ పాటను విడుదల చేసిన మేకర్స్.. గురువారం ‘హమ్ సఫర్’ అనే మరో పాటను లాంచ్ చేశారు.
గోపీసుందర్ సంగీతం అందించగా శక్తి శ్రీ గోపాలన్ పాడారు. ‘ఇతడే నా హమ్ సఫర్’ అంటూ కృష్ణకాంత్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఈ చిత్రానికి భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ రాశారు. నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, దేవి ప్రసాద్, ప్రియ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 29న సినిమా విడుదల కానుంది.