తమిళనాడులో మరో స్టూడెంట్​ సూసైడ్

తమిళనాడులో మరో స్టూడెంట్​ సూసైడ్

దండం పెట్టి చెప్తున్నా.. ఆత్మహత్యలు వద్దు: సీఎం స్టాలిన్

చెన్నై: నీట్​లో క్వాలిఫై అవుతానో కానో అనే టెన్షన్​తో తమిళనాడులో మరో స్టూడెంట్(17) ఆత్మహత్య చేసుకుంది. వెల్లూరుకు చెందిన సౌందర్య సూసైడ్ చేసుకుంది. బుధవారం పొద్దున 9.30 గంటలకు తల్లిదండ్రులు పనికి వెళ్లగా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని డీఎస్పీ పళని తెలిపారు. ఈసారి తాను ఎగ్జామ్ క్లియర్ చేయలేనని తల్లిదండ్రులకు ఆ అమ్మాయి చెప్పిందని, వచ్చేసారి బాగా రాయమని వాళ్లు సముదాయించారని తెలిసింది. రోజుకూలీ కూతురైన ఆ స్టూడెంట్​కు ఇంటర్​లో 84.9 శాతం మార్కులొచ్చాయి. నీట్ ఎగ్జామ్ కు సంబంధించి తమిళనాడులో ఇది మూడో సూసైడ్. మంగళవారం కూడా ఓ స్టూడెంట్ నీట్​లో క్వాలిఫై అవుతానో కానో అని ఆత్మహత్య చేసుకుంది. ఎగ్జామ్​కు ఓ రోజు ముందు ఆదివారం సేలమ్​కు దగ్గర్లో 19 ఏళ్ల మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. వ్యవసాయ కూలీ కొడుకైన ధనుష్ ఇప్పటికే రెండుసార్లు ఎగ్జామ్ రాసినా కూడా క్వాలిఫై కాలేదు. 
మీకు సాధ్యం కానిదంటూ ఏం లేదు
స్టూడెంట్ల ఆత్మహత్యలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ‘మిమ్మల్ని వేడుకుంటున్నా. దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. నమ్మకంతో చదవండి. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఒత్తిడి పెంచకండి. వాళ్లలో ధైర్యం, నమ్మకం నింపండి’ అని చెప్పారు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్రం మనసు కరగట్లేదని విమర్శించారు. నీట్ రద్దుకు న్యాయపరంగా పోరాడతామన్నారు. నీట్ విషయంలో భయపడుతున్న పిల్లలు 104కు డయల్​ చేసి మెంటల్ హెల్త్ ఎక్స్ పర్ట్స్ తో మాట్లాడాలని సూచించారు.