చైనాలో ఇంకో వైరస్: ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం

చైనాలో ఇంకో వైరస్: ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం

‘జీ4’ అనే వైరస్ను గుర్తించిన చైనా సైంటిస్టులు
స్వైన్ ఫ్లూలోనే కొత్త రకం వైరస్
పందుల నుంచి తీసుకున్న 30 వేల శాంపిళ్లపై రీసెర్చ్
2016 నుంచి మనుషులకు సోకినట్టుగా గుర్తింపు

చైనాలో మరో ప్రాణాంతక వైరస్ బయటపడింది. కరోనా వైరస్ మహమ్మారి గండం పోకముందే అది పుట్టిన దేశంలోనే మరో మహమ్మారి కోరలు చాచేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఉన్న స్వైన్ ఫ్లూ వైరస్ లోనే ఇంకో కొత్త రకం వైరస్ మూలాలు డ్రాగన్ కంట్రీలో వెలుగు చూశాయి. దానిని ‘జీ4’ వైరస్ అని సైంటిస్టులు పిలుస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే దానిపై హెచ్చరిక కూడా చేసింది.

బీజింగ్ : జీ4.. ఇప్పుడు ప్ర‌పంచాన్ని కలవరపెడుతున్న‌ ఇంకో వైరస్. 11 ఏళ్ల‌ నాటి మహమ్మారి స్వైన్ ఫ్లూ లో ఇదో కొత్త‌ రకం. ఆ స్త్వైన్ ఫ్లూ అమెరికాలో పుడితే.. ఈ కొత్త‌రకం స్వైన్ ఫ్లూ ఇప్పుడు కరోనా పుట్టిన‌ దేశం చైనాలోనే పుట్టింది. ఇది మరో మహమ్మారిగా మారే ముప్పుందన్న‌ ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. నిజానికి కొత్త‌గా వెలుగు చూసిన ఈ జీ4 వైరస్ పాతదే. చైనాకు చెందిన సైంటిస్టులే దీనిని గుర్తించారు. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్, షాండోంగ్ అగ్రిక‌ల్చ‌రల్ యూనివర్సిటీ, చైనీస్ నేషనల్ ఇన్ ఫ్లుయెంజా సెంటర్ సహా కొన్ని ప్ర‌భుత్వ‌ సంస్థ‌లు 2011 నుంచి దీనిపై రీసెర్చ్ చేస్తున్నాయి.

ఆ ఏడాది నుంచి 2018 వరకు దేశంలోని 10 ప్రావిన్స్ లలో ఉన్న‌ పందుల కబేళాలు, వెటర్న‌రీ టీచింగ్ హాస్పిట‌ళ్ల‌ నుంచి 30 వేల శాంపిళ్ల‌ను సైంటిస్టులు సేకరించారు. అందులో 179 రకాల స్వైన్ ఫ్లూ వైరస్ లను గుర్తించారు. ఆ వైరస్ లలో చాలా వరకు అంత హాని చేయవని నిర్దారించారు. కొన్ని రోజులు కాగానే అవన్నీ నాశనమవుతున్న‌ట్లు తేల్చారు. కానీ, స్వైన్ ఫ్లూ జీన్స్ (హెచ్ 1ఎన్ 1) ఉన్న ఈ జీ4 వైరస్ మాత్రం ఎప్ప‌టికప్పుడు స్ట్రాంగ్ అవుతున్న‌ట్లు గుర్తిచారు. ప్ర‌త్యేకించి 2016 తర్వాత అది మరింత ఎక్కువైతున్న‌ట్లు తేల్చారు. దానితో మహా డేంజర్ పొంచి ఉందని హెచ్చ‌రించారు.

ఏ వ్యాక్సినూ పనిచేయదు..

ఇప్ప‌టికే చైనా వాళ్ల‌కు ఆ వైరస్ సోకింది. 2016 నుంచి 2018 మధ్య‌ పందులను పెంచే రైతుల్లో 10 శాతం మందికి, మామూలు జనంలో 4.4 శాతం మందికి జీ4 వైరస్ సోకినట్లు యాంటీ బాడీ టెస్టుల్లో సైంటిస్టులు తేల్చారు. ఆ కేసులు కూడా పందుల పెంపకం ఎక్కువ‌గా ఉండే హీబే, షాండోంగ్ పారవిన్స్ లలోనే ఉన్న‌ట్లు గుర్తించారు. ఇదేం కొత్త‌ వైరస్ కాదని, పాత వైరసేనని సైంటిసుట్లు చెబుతున్నారు. ఒకవేళ ఇది సోకినా ఇప్పుడున్న ఏ వ్యాక్సినూ దానిపై పనిచేయదని హెచ్చ‌రిస్తున్నారు.
స్వైన్ ఫ్లూ జీన్సే జీ4లోనూ ఉన్నా.. ఇప్ప‌టికే వేసుకున్న స్వైన్ ఫ్లూ వైర‌స్ సహా ఏ ఫూల్ వైర‌స్ పనిచేయదని, దానిపై మనకు ఎలాంటి ఇమ్యూనిటీ రాదని హెచ్చ‌రిస్తున్నారు. అయితే, వైరస్ పందుల నుంచి మనిషికి సోకినా.. మనిషి నుంచి మనిషికి సోకిన ఆధారాలు లేవంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్ట‌న్ బయాలజీ ప్రొఫెసర్ కార్ల్ బెర్గ్ స్టార్మ్. ఐదేళ్లుగా దానిపై రీసెర్చ్ లు చేస్తున్న‌ మనుషుల నుంచి మనుషులకు సోకిన దాఖలాలు లేవన్నారు. అయితే, దానిని తేల్చేందుకు మరిన్ని స్ట‌డీలు చేయాల్సిన‌ అవసరం ఉందని చెబుతున్నారు. అయితే, వివిధ దేశాల్లో జనాలు పంది మాంసం తింటారు కాబట్టి.. వాటి నుంచి జనాలకు సోకే ముప్పు ఎక్కువ‌గానే ఉంటుందని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. మరింత మందికి సోకే ముప్పు లేకపోలేదని, దాని వల్ల ప్రాణాలు పోయే ప్ర‌మాదమూ ఉందని అంటున్నారు.

అలుసొద్దు : WHO

కొత్త స్వైన్ ఫ్లూ వైరస్ పై అలుసు వద్ద‌ని డబ్లూ హెచ్ వో హెచ్చరించింది. అది కూడా మరో మహ‌మ్మారిగా మారే ముప్పు ఉందని చెప్పింది. మంగళవారం డబ్లూహెచ్ వో ప్ర‌తినిధి క్రిస్టియ‌న్ లిండ్ మైర్ మాటాల్డుతూ.. ‘‘ఈ ప్రాణాంతక వైరస్ గురించి డబ్లూ హెచ్ వో జాగ్ర‌త్త‌గా రీసెర్చ్ చేస్తుంది. జీ4ను తక్కువ‌ అంచనా వేయొద్దు. అది మనుషులకు ఎక్కువగా సోకుతోంది. మహమ్మారిగా మారే ముప్పు ఉన్నందున ఆ స్ట‌డీ పేపరను చాలా జాగ్ర‌త్త‌గా పరిశీలిస్తున్నాం. ఇన్ ఫుల్యెంజాపై పోరును
ఆపొద్దు. కరోనా టైంలోనూ దానిపై మరింత నిఘా పెట్టాల్సిన‌ అవసరం ఉంది. లేదంటే మరో ముప్పు త‌ప్ప‌దు’’ అని లిండ్ మైర్ చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం