
విజయ రామరాజు టైటిల్ రోల్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’.విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి యాంథమ్ రిలీజ్ చేశారు. విఘ్నేష్ భాస్కరన్ ఈ సాంగ్‌ని కంపోజ్ చేయగా, దర్శకుడు విక్రాంత్ ఇన్‌స్పైర్ చేసే లిరిక్స్ రాశాడు. దీపక్ బ్లూ, బృథ్వీవ్ సత్యకుమార్ , విఘ్నేష్ పాయ్ కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది.
►ALSO READ | VijayRashmika: అల్లు అర్జున్-స్నేహ జోడి తర్వాత.. అరుదైన గౌరవం అందుకున్న విజయ్, రష్మిక
‘ఓ వీర నువ్వు పదరా, ఓటమే నీ శిలరా.. ఓ వీర నిప్పు అవరా, గాయాలే మండుకురా.. చీకటే చీల్చుకురా, సూర్యుడే నువ్వైరా..’ అంటూ సాగిన పాటలో రామరాజు పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 29న సినిమా విడుదల కానుంది.