VijayRashmika: అల్లు అర్జున్-స్నేహ జోడి తర్వాత.. అరుదైన గౌరవం అందుకున్న విజయ్‌, రష్మిక

VijayRashmika: అల్లు అర్జున్-స్నేహ జోడి తర్వాత.. అరుదైన గౌరవం అందుకున్న విజయ్‌, రష్మిక

ప్రసెంట్ టాక్ అఫ్ ది టాలీవుడ్ అంటే.. విజయ్‌ దేవరకొండ, రష్మిక అనక తప్పదు. సూపర్ స్క్రీన్ జోడీగానే కాకుండా రూమర్ జోడిగా కూడా సినీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. వీరిద్దరూ ఒకటిగా కనిపిస్తానే.. సోషల్ మీడియా మార్మోగిపోతుంది. అలాంటిది లేటెస్ట్ గా ఒకే వేదికపై కలిసి హాజరయ్యారు. ఒకటిగా కనిపిస్తూనే ఎంతో అందంగా సందడి చేశారు.

విజయ్, రష్మిక జంట అమెరికాలో భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లో జరిగిన ది వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇండియా డే కవాతుకు హాజరయ్యారు. న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు వారిద్దరూ ' గ్రాండ్‌ మార్షల్‌' గా వ్యవహరించారు. FIA అనేది అమెరికాలోని భారతీయ ప్రవాసుల కోసం స్థాపించబడిన ప్రముఖ సంస్థ. 

ఈ క్రమంలో న్యూయార్క్‌లో జరిగిన 43వ ఇండియా డే పరేడ్‌కు విజయ్, రష్మిక అటెండ్ అయ్యి.. అందర్నీ ఆకర్షించారు. మాడిసన్ అవెన్యూ పరేడ్లో ఒకరిచేయి ఒకరు పట్టుకొవడం, ఒకే లేత గోధుమరంగు దుస్తులను ధరించడం, నవ్వుతూ, అక్కడఉన్నవారిని పలకరిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే, ఈ బ్యూటిఫుల్  జంటపై ఇన్నాళ్లు వస్తోన్న రూమర్స్ నిజమయ్యాయి అని నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలెట్టారు. అలాగే, ఈ జంట చాలాకాలం తర్వాత ఒకే స్టేజిపై కనిపించడం ఇదే మొదటిసారి. 2022లో ఇదే గౌరవాన్ని టాలీవుడ్‌ నుంచి మొదటిసారి అల్లు అర్జున్‌, స్నేహ జోడీ అందుకున్నారు. ఆ తర్వాత విజయ్, రష్మిక కావడం విశేషం.