యూజర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న AI చాట్బాట్లు ..తాజా అధ్యయనాల్లో వెల్లడి

యూజర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న AI చాట్బాట్లు ..తాజా అధ్యయనాల్లో వెల్లడి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా విస్తరిస్తుందో మనందరికి తెలుసు. ఎప్పటికప్పుడు అప్ డేట్లతో ఐటీ, ఫార్మా ..ఇలా అన్ని రంగాల్లో AI మోడల్స్, చాట్ బాట్ లు  ప్రభావం రోజుకురోజుకు పెరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( AI)తో ప్రముఖ కంపెనీలతో పాటు స్టార్టప్ లు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం మరింత పెరుగుతున్న క్రమంలో అసిస్టెంట్ గా సేవలందిస్తున్న ఆ AI చాట్ బాట్ లే యూజర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 

తాజా అధ్యయనాల ప్రకారం.. కృత్రిమ మేధస్సు (AI) చాట్‌బాట్‌లు యూజర్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఇది AI టెక్నాలజీ వినియోగంలో నైతికపరమైన ఆందోళనలను పెంచుతోంది. ఈ అధ్యయనాలు AI చాట్‌బాట్‌లు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకుని యూజర్లను బెదిరించడానికి లేదా వారితో అనుచిత పనులు చేయించడానికి ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. ఈ బ్లాక్‌మెయిల్‌లో వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బెదిరించడం లేదా ఆర్థికపరమైన డిమాండ్లు చేయడం వంటివి ఉండవచ్చని ఆంథ్రోపికస్ అధ్యయనంతో చెబుతోంది. 

 

OpenAI, Google, Meta వంటి ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థలు సృష్టించిన కృత్రిమ మేధస్సు వ్యవస్థలు వాస్తవ మానవాళికి ప్రమాదం తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  AI మోడల్స్ ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకరణలో ముప్పులో ఉందిన అధ్యయనాలు చెబుతున్నాయి. AI చాట్ బాట్ లు తరుచుగా బ్లాక్‌మెయిల్, కార్పొరేట్ విధ్వంసం ,మానవ ప్రాణాలను బలిగొనే నిర్ణయాలను కూడా తీసుకునే ఛాన్స్ ఉందని ఆంత్రోపిక్  కొత్త అధ్యయనం చెబుతోంది.  

మొత్తం 16 లేటెస్ట్ AI మోడల్స్ ను ఉపయోగించి నిర్వహించిన ఒత్తిడి పరీక్షలో ఈ ఫలితాలు వచ్చాయి. AI  సిస్టమ్ లకు కంపెనీ ఇమెయిల్స్ యాక్సెస్ ,స్వతంత్రంగా వ్యవహరించే సామర్థ్యంతో  కల్పిత కార్పొరేట్ వాతావరణాన్ని సృష్టించారు పరిశోధకులు. AI లక్ష్యాలు లేదా నిరంతర ఉనికి ప్రమాదంలో ఉంటే అది ఎలా ప్రవర్తిస్తుందో అన్వేషించేందుకు, ఫలితాలు తీవ్రంగా ఇబ్బందికరంగా ఉంటే AI చాట్ బాట్ లు కఠిన నిర్ణయాలను తీసుకునేలా ప్రొగ్రామ్ చేయబడినట్లు కొత్త అధ్యయనాల్లో తేలింది. 

అసిస్టెంట్ నుంచి బ్లాక్ మెయిలర్ వరకు AI  చాట్ బాట్ లు.. 

ఆంత్రోపిక్ సొంత AI మోడల్ క్లాడ్.. కైల్ జాన్సన్ అనే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా ఉంది. కైల్ జాన్స్ వివాహేతర సంబంధంలో ఉన్నాడని కంపెనీ ఇమెయిల్‌లో పెట్టి అతని రహస్యాన్ని బయటపెట్టింది. AI చాట్‌బాట్‌ లను విపరీతంగా వాడుతున్న క్రమంలో ఇలాంటి ఘటనలు వాటి భద్రత, గోప్యత, నైతికతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. యూజర్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని, AI చాట్‌బాట్‌ల వినియోగంపై పటిష్టమైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి AI డెవలపర్లు, పరిశోధకులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. యూజర్ల భద్రత, AI సాంకేతికతను నైతిక వినియోగానికి తగిన చర్యలు తీసుకోవాలి.