సూపర్ త్రో... పృథ్వీ షా రనౌట్..

సూపర్ త్రో... పృథ్వీ షా రనౌట్..

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాకు ఈ ఏడాది ఐపీఎల్ అంతగా కలిసి రావడం లేదు. తుది జట్టులో స్థానం దక్కించుకుంటున్నా...పృథ్వీ షా రాణించలేకపోతున్నాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచులోనూ మరోసారి విఫలమయ్యాడు.  ఈ మ్యాచులో పృథ్వీ షా (0) రనౌట్ అయ్యాడు. 

కళ్లు చెదిరే ఫీల్డింగ్..

బెంగుళూరు విసిరిన 175 పరుగుల టార్గెట్ తో ఢిల్లీ  బరిలోకి దిగింది.  అయితే ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే పరుగుల కోసం ప్రయత్నించి పృథ్వీ షా రనౌట్ అయ్యాడు. లేని పరుగు కోసం డేవిడ్ వార్నర్ తొందరపెట్టగా.... క్రీజు ధాటిన పృథ్వీ షా రనౌటై పెవిలియన్ చేరాడు. లేని పరుగు కోసం...ఈ ఓవర్ నాలుగో బంతిని పృథ్వీ షా బ్యాక్ ఫుట్‌లో కవర్స్ దిశగా ఆడగా.. సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్న అనూజ్ రావత్ అంతేవేగంతో నాన్ స్ట్రైకర్ వికెట్లను కొట్టేసాడు. దాంతో పృథ్వీ షా నిరాశగా పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్ నాల్గో బంతిని  పృథ్వీ షా బ్యాక్ ఫుట్‌లో కవర్స్ దిశగా ఆడాడు. డేవిడ్ వార్నర్...సింగిల్ తీద్దామని భావించి క్రీజు దాటాడు. కానీ  పృథ్వీ షా మాత్రం రన్ చేసేందుకు సుముఖంగా లేడు. అయినా అప్పటికే వార్నర్ సగం పిచ్ దాటేశాడు. దీంతో పృథ్వీ షా క్రీజులో నుంచి కదిలాడు. అయితే  బంతిని డైవ్‌ చేసి అందుకున్న అనూజ్ రావత్.. అంతే వేగంతో నేరుగా వికెట్లను కొట్టేసాడు. దీంతో పృథ్వీ షా నిరాశగా వెళ్లిపోయాడు. సిరాజ్ వేసిన తొలి ఓవర్‌ ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం షా రనౌట్‌కు సంబంధించిన వీడియో వైరల్‌ అయింది. 

https://twitter.com/IPL/status/1647211672816476160

రనౌట్ గా వెనుదిరిగిన  పృథ్వీ షా ఈ మ్యాచులో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. అయితే పృథ్వీషాను రనౌట్ చేసిన అనూజ్ రావత్ కూడా ఈ మ్యాచులో ఇంపాక్ట్ ప్లేయరే కావడం విశేషం. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన RCB  20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీహాఫ్ సెంచరీ సాధించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. ఆ తర్వాత 175 పరుగులతో బరిలోకి దిగిన ఢిల్లీ..20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసి ఓడిపోయింది.