రాగ్ మయూర్ హీరోగా, ‘డిజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అనుమాన పక్షి’. మెరీన్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ హీరోయిన్ రాశి కీలక పాత్ర పోషించారు. రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. శుక్రవారం ‘గులాబ్ జామ్’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన పాటకు కిట్టు విస్సా ప్రగడ క్యాచీ లిరిక్స్ అందించగా, రమణ గోగుల పాడిన తీరు ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన దిల్ రాజు అందర్నీ ఎంటర్‌టైన్ చేసే చిత్రమిది అని అన్నారు. రాగ్ మయూర్ మాట్లాడుతూ ‘కంప్లీట్ క్యారెక్టర్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అందులోనూ ఈ సినిమాలో రమణ గోగుల గారు పాట పాడటం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన ఈ పాటని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. దాదాపు షూటింగ్ అంతా కాశ్మీర్‌లో చేశాం. పెహల్గాం ఘటన తర్వాత అక్కడ షూట్ చేసిన ఫస్ట్ మూవీ ఇది’ అని చెప్పాడు.
డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ ‘ఇదొక కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్. అలాగే చిన్న సైకలాజికల్ సస్పెన్స్ కూడా ఉంటుంది. కచ్చితంగా ధియేటర్లో ఒక ఫన్ రైడ్‌లా ఉంటుంది’ అని అన్నాడు. ఇది చాలా యూనిక్ ఫిల్మ్ అని నిర్మాత రాజీవ్ చిలకా అన్నారు. హీరోయిన్ మెరీన్, రాశి, కో ప్రొడ్యూసర్ భరత్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల పాల్గొన్నారు.
