మ్యూజిక్ ఆల్బమ్స్‌‌తో సరికొత్త ప్రయత్నం

మ్యూజిక్ ఆల్బమ్స్‌‌తో సరికొత్త ప్రయత్నం

ఓ వైపు హీరోయిన్‌‌గా వరుస సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు మ్యూజిక్ ఆల్బమ్స్‌‌తో సరికొత్త ప్రయత్నం చేస్తోంది  అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఓ ప్రైవేట్ ఆల్బమ్‌‌లో నటించి అందర్నీ ఆకట్టుకుంది.  సినిమాటో గ్రాఫర్ రిచర్డ్ ప్రసాద్ దర్శకుడిగా ఈ పాటను రూపొందించారు. జపాన్‌‌లోని టోక్యో అందాలు చూపిస్తూ ఉల్లాసంగా సాగిన ఈ పాటలో అనుపమ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. డెన్నిస్ నార్టన్ దీనికి సంగీతం అందించాడు.

సింగర్ చిన్మయి శ్రీపాద పాడింది.  ఏ.వసంత్ సినిమాటో గ్రఫీ అందించారు. బాబీ ఫిల్మ్స్, ఆయేరా స్టూడియోస్, రూబీ నాజ్ పాటను నిర్మించారు. ‘పద పద.. పద పద.. మనసుకు తెలియద చేరే దూరము.. పద పద..పద పద.. నెపములు వెతకక పెంచే వేగమే’ అంటూ కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి.  ఇది ప్రైవేట్ పాట అయినప్పటికీ మూవీ రేంజ్‌‌లో తెరకెక్కించడం విశేషం.