
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనదైన యాక్టింగ్ తో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). చాలా రోజుల నుంచి ఈ బ్యూటీకి సరైన అవకాశాలు రాకపోవడంతో..పనై అయిపోందంటూ వినిపిస్తోన్న కామెంట్స్లో నిజం లేదంటూ వరుస సినిమాల్లో నటిస్తోంది.
రీసెంట్గా చియాన్ తనయుడు ధృవ్ విక్రమ్ మూవీకి సైన్ చేసిన ఈ బ్యూటీ..త్వరలో తెలుగులో ఓ విభిన్నమైన రోల్లో కనిపించబోతుందంటూ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
గత ఏడాది జూన్ లో 'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల (Praveen Kandregula) డైరెక్షన్లో ఒక సినిమాకు అనుపమ పరమేశ్వరన్ కమిట్ అయ్యింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమాకు 'పరదా' అనే విభిన్నమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం అందుతోంది.
ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ ఇంకా పలువురు యంగ్ స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న 'పరదా'(Parada) సినిమాలో అనుపమను ఎలా కనిపిస్తుందో అంటూ ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నఈ చిత్రం నుండి త్వరలో క్రేజీ అప్డేట్ రానుంది
త్వరలో డీజే సిద్దుతో టిల్లూ స్క్వేర్ రిలీజ్కు రెడీ అయింది. ఈ మూవీలో తన క్యారెక్టర్ కు అందరు ఫిదా అవ్వాల్సిందే అంటూ ఆసక్తి రేపింది.అంతేకాకుండా డబుల్ డోస్ రొమాన్స్ తో కుర్రాళ్లను లైన్ లో పెట్టేసింది.ఈ సినిమాలే కాకుండా మలయాళం, తెలుగు తమిళ సినిమాలతో అనుపమ ఫుల్ బిజీగా మారింది.