బటర్‌‌‌‌ ఫ్లైకి భయమెందుకు?

బటర్‌‌‌‌ ఫ్లైకి భయమెందుకు?

అనుపమ పరమేశ్వరన్  లీడ్‌‌ రోల్‌‌లో గంటా సతీష్ బాబు ‘బటర్‌‌‌‌ ఫ్లై’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భూమిక, నిహాల్  కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లమెల్లి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్‌‌‌‌ నిన్న విడుదలయ్యింది. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం నలభై సెకన్ల నిడివితో అత్యంత ఉత్కంఠ భరితంగా ఈ టీజర్‌‌‌‌ను కట్ చేశారు. అనుపమని ఎవరో వెంటాడుతున్నారు. భయపెడుతున్నారు. ఆమె టెన్షన్ పడుతోంది. తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నిస్తోంది. అటూ ఇటూ పరుగులు పెడుతోంది. దానికి తోడు ‘నీ కళ్లని నమ్మొద్దు,  బ్రెయిన్‌‌ని కూడా నమ్మొద్దు.  మరి వేటిని నమ్మాలి?’ అంటూ వచ్చిన డైలాగ్స్‌‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. థ్రిల్లింగ్‌‌ విజువల్స్‌‌తో పాటు అరవింద్ షారోన్, గిడియన్ కట్టా ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.