రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా గ్లామరస్ రోల్‌తో మెస్మరైజ్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. వరుస సినిమాలు చేస్తూ తన స్పీడ్‌ను మరింత పెంచింది. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. తర్వాత తెలుగులో బాగా బిజీ అయింది. సొంత పరిశ్రమ అయిన మాలీవుడ్ కంటే టాలీవుడ్‌లోనే అనుపమ ఎక్కువ సినిమాలు చేసింది.
అయితే ఇప్పుడు ఆమె ఫోకస్ మాలయాళంపై ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతోంది. ఇప్పటికే ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రంలో నటిస్తున్న అనుపమ.. తాజాగా తన తర్వాతి ప్రాజెక్టును అనౌన్స్ చేసింది. నెక్స్ట్ అంటూ ‘ద పెట్ డిటెక్టివ్’ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో మలయాళ నటుడు షరాఫుద్దీన్‌తో పాటు అనుపమ నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రనీష్ విజయన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరోవైపు దర్శకులు ప్రవీణ్ కాండ్రేగుల, మారి సెల్వరాజ్, ప్రశాంత్ వర్మలతో అనుపమ పరమేశ్వరన్ సినిమాలు చేస్తోంది. వీటితో పాటు ఆమెకు మరిన్ని ఆఫర్స్ క్యూలో ఉన్నాయి.