మహాశివరాత్రి జాతర పనుల్లో వేగం పెంచాలి : అనురాగ్ జయంతి

మహాశివరాత్రి జాతర పనుల్లో వేగం పెంచాలి  : అనురాగ్ జయంతి

వేములవాడ, వెలుగు: వచ్చే నెల 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్​ అనురాగ్​ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం వేములవాడలో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  గౌతమితో కలిసి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు, గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ, లైబ్రరీ భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.  పట్టణంలో శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. జాతర  కంటే ముందుగానే గుడిచెరువు ప్రాంగణంలో రూ. 90 లక్షలతో నిర్మిస్తున్న శివార్చన స్టేజీ పూర్తిచేయాలన్నారు. అక్కడే భక్తుల కోసం షెడ్లు నిర్మించేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ చేయాలన్నారు.

రూ.12 కోట్లతో చేపడుతున్న గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులపై దృష్టి పెట్టాలన్నారు. ఆయన వెంట పీఆర్ ఈఈ సూర్య ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, కమిషనర్ అన్వేష్, తహశీల్దార్ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్, ఆలయ ఈఈ రాజేష్, పర్యాటక శాఖ ఏఈ జీవన్ రెడ్డి ఉన్నారు.