GHAATI: ‘ఘాటి’ సెన్సార్ రివ్యూ.. అనుష్క క్రైమ్ డ్రామా కథేంటీ? క్రిష్ కమ్‌బ్యాక్‌ ఇస్తాడా?

GHAATI: ‘ఘాటి’ సెన్సార్ రివ్యూ..  అనుష్క క్రైమ్ డ్రామా కథేంటీ? క్రిష్ కమ్‌బ్యాక్‌ ఇస్తాడా?

అనుష్క నటించిన లేటెస్ట్ యాక్షన్ క్రైమ్ డ్రామా ‘ఘాటి’ (GHAATI). డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌ బ్యానర్‌‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ క్రమంలో లేటెస్ట్గా ‘ఘాటి’ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు U/A స‌ర్టిఫికెట్ జారీ చేసినట్లు సినీ వర్గాల సమాచారం. 2 గంట‌ల 35 నిమిషాల రన్ టైంతో మూవీ రానుంది. ఈ సందర్భంగా క్రిష్‌, అనుష్క‌కు ‘ఘాటి’ పెద్ద బ్రేక్ ఇవ్వనున్నట్లు టాక్.

అరకు, గాంజా మాఫియా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కథ రూపొందించినట్లు టాక్. ఫ‌స్టాఫ్ మొత్తం ఎమోష‌న‌ల్ జ‌ర్నీతో మొదలై, ఇంటర్వెల్కి బిగ్ ట్విస్ట్ ఉండబోతుందట. అలాగే, సెకండాఫ్ ఊహించని రీతిలో ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్‌గా ఉంటుందని సినీ వర్గాల విశ్వసనీయ సమాచారం. విక్రమ్‌ ప్రభు, చైతన్య రావు, జగపతిబాబు, రవీంద్రన్ విజయ్ పాత్రలు పవర్ ఫుల్గా ఉండనున్నాయట. ముఖ్యంగా అనుష్క శత్రువులను ఉచకోత కోస్తూ తన వీరత్వాన్ని ప్రదర్శించిందని సెన్సార్ టాక్.

►ALSO READ | నిఖిల్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమా.. ఆసక్తి రేకెత్తిస్తున్న 'SVCLLP x నిఖిల్' పోస్టర్!

ఓవరాల్గా ‘ఘాటి’.. 'ఫ‌స్టాఫ్ మొత్తం ఎమోష‌న‌ల్, సెకండాఫ్ యాక్షన్ మోడ్'.. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని సెన్సార్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్లో అనుష్క రౌద్రంగా, శక్తివంతంగా ఎలా ఉందో చూసేశాం. ఇపుడు అంతకుమించిన డ్రామా, యాక్షన్ పక్కా అనే క్లారిటీ సెన్సార్ నుంచి రావడంతో ఆసక్తి నెలకొంది.

'U/A' సర్టిఫికేట్: ఎవరైనా  దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.

‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్‌‌ కాంబినేషన్‌‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఈ క్రమంలో మూవీపై ముందునుంచే భారీ అంచనాలున్నాయి. అలాగే యూవీ క్రియేషన్స్‌‌తో అనుష్కకు ఇది నాలుగో సినిమా అవడం విశేషం. ఇదిలా ఉంటే ‘ఘాటి’ అనగా లోయ అని అర్ధం. మూవీకి శ్రీనివాసరావు కథను అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందించారు.