
పెళ్లి చేసుకుని నాలుగేళ్ల పాటు నటనకి దూరంగా ఉన్న అనుష్కాశర్మ.. ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’ మూవీతో రీఎంట్రీ ఇస్తోంది. క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ ఇది. ఆమె పాత్రనే అనుష్క పోషిస్తోంది. పెళ్లయ్యి, ఓ బిడ్డకు తల్లయ్యాక స్పోర్ట్స్ పర్సన్‌గా నటించడం కాస్త కష్టమైన పని అని, ఆ చాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసి అనుష్క తానేంటో చూపించిందని అందరూ మెచ్చుకుంటున్నారామెని. అయితే ఇంతలోనే మరో మూవీని కూడా లైన్‌లో పెట్టింది అనుష్క. ఇది కూడా స్పోర్ట్స్ బేస్డ్ మూవీనే కావడం విశేషం. ప్రస్తుతం ‘లాల్‌సింగ్ చద్ధా’ మూవీ చేస్తున్న ఆమిర్‌ఖాన్.. ఆ తర్వాత ‘శుభ్ మంగల్ సావధాన్’ ఫేమ్ ఆర్‌ఎస్ ప్రసన్న డైరెక్షన్‌లో నటించనున్నాడు. స్పానిష్ సూపర్ హిట్ ‘క్యాంపేయొనీస్’కి రీమేక్ ఇది. పొగరుబోతు, తాగుబోతు అయిన ఫుట్‌బాల్ కోచ్.. ఫిజికల్లీ చాలెంజ్డ్ ఆటగాళ్ల టీమ్‌కి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్లని ఎలా గెలిపించాడనేది కథ. ఆ కోచ్‌గా ఆమిర్ కనిపించబోతున్నాడు. హీరోయిన్‌గా అనుష్కను తీసుకున్నారట. వీళ్లిద్దరూ గతంలో కలిసి నటించిన ‘పీకే’ మూవీ పెద్ద హిట్టయ్యింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో సెట్టయ్యింది. మరి అనుష్క కూడా ఆమిర్‌లాగే ప్లేయరా లేక మరేదైనా పాత్రలో కనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి వరుస స్పోర్ట్స్ బేస్డ్ మూవీస్‌తో సెకెండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసిన అనుష్క.. అప్పటిలాగే స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుందో లేదో చూడాలి.