బుల్లి కోహ్లీ రాబోతున్నారు.. బేబీ బంప్‌తో అనుష్క శర్మ

బుల్లి కోహ్లీ రాబోతున్నారు.. బేబీ బంప్‌తో అనుష్క శర్మ

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ దంప‌తులు మరోసారి తండ్రి కాబోతున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్‍లకు హాజరైన అనుష్క శర్మ బేబీ బంప్‌తో కనిపించడంతో ఈ వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా, అనుష్క శర్మ మరోసారి బేబీబంప్‌తో ప్రత్యక్షమ‌య్యారు. బెంగుళూరులోని ఓ హోట‌ల్‌లో ఈ జోడి మీడియా కంటపడ్డారు. దీంతో మరోసారి ఈ వార్త తెరపైకి వస్తోంది. త్వరలోనే బుల్లి కోహ్లీ రాబోతున్నాడని అతని అభిమానులు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.  

ప్రేమ.. పెళ్లి

కొన్నేళ్ల పాటు ప్రేమలో విహరించిన ఈ జోడి 2017లో పెళ్లి పీటలెక్కారు. అనంతరం నాలుగేళ్ల‌కు 2021 జనవరిలో అనుష్క‌శ‌ర్మ మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి వామిక అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఈ కుటుంబంలోకి మరో బిడ్డ రాబోతుందనే వార్త కోహ్లీ అభిమానులకు మంచి ఆనందాన్ని ఇస్తోంది.

సినిమాల‌కు దూరంగా అనుష్క!

వామిక జన్మించాక అనుష్క శర్మ సినిమాల‌కు కాస్త దూరంగానే ఉంటోంది. ఏదో అరకొరగా సినిమాలు చేస్తున్నా.. కూతురుకే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తోంది. ఇక విరాట్ కోహ్లీ మునుపటిలానే క్రికెట్‌లో బిజీ బిజీగా ఉన్నారు. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో మంచి జోరు కనబరుస్తున్నారు.  ఇప్పటివరకూ ఈ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 540 పరుగులు చేసిన కోహ్లీ.. అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.