RCB: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆర్‌సీబీ వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. బెంగళూరు తరఫున 19 ఏళ్లుగా ఆడుతున్న కోహ్లీ, మోడీ స్టేడియంలో భారీ సిక్స్ కొట్టి జట్టుకి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ని స్టాండ్స్ నుంచి చూస్తున్న అనుష్క శర్మ, ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలవడంతో కింగ్ కోహ్లీ స్టైల్ లో సంబరాలు చేసుకుంది.
విరాట్ స్టైల్లో అనుష్క శర్మ సెలబ్రేషన్స్:
విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టి ఐపీఎల్ 2026 సీజన్‌ను ముగించి, ఆర్‌సీబీని మరోసారి ఛాంపియన్‌గా నిలిపాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోని ప్రేక్షకులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఇక మరోవైపు స్టాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మ కూడా సంతోషంతో చేతులు ఊపుతూ గట్టిగా కేకలు వేసింది. అంతకుముందు, శుభ్‌మన్ గిల్ వికెట్ పడినప్పుడు విరాట్ కోహ్లీ జరుపుకున్న సెలబ్రేషన్స్ లాగే అనుష్క కూడా వేడుకలు చేసుకుంది.
టైటిల్ నిలబెట్టుకున్న ఆర్సీబీ
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌పై సునాయాస విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. 156 పరుగుల లక్ష్య ఛేదనలో, విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ఛేజ్ చేసి, తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ టైటిల్‌లని నిలబెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల తర్వాత స్థానంలో ఆర్సీబీ నిలిచింది.
𝙁𝙞𝙧𝙨𝙩 𝙩𝙞𝙢𝙚 𝙬𝙖𝙨 𝙨𝙤 𝙣𝙞𝙘𝙚, 𝙩𝙝𝙚𝙮 𝙝𝙖𝙙 𝙩𝙤 𝙙𝙤 𝙞𝙩 𝙩𝙬𝙞𝙘𝙚 ❤️@RCBTweets are your #TATAIPL 2026 Champions 🏆#Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/vAqXacHPju
— IndianPremierLeague (@IPL) May 31, 2026
Finishing off in style 🥳
— IndianPremierLeague (@IPL) May 31, 2026
And it's none other than King Kohli 😎👑
Scorecard ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/FZNGQ26gBs
