బౌలర్‌గా అరుదైన ఘనత నా భర్తకే సొంతం: కోహ్లీకి పుట్టినరోజు నాడు అనుష్క శర్మ స్పెషల్ పోస్ట్

బౌలర్‌గా అరుదైన ఘనత నా భర్తకే సొంతం: కోహ్లీకి పుట్టినరోజు నాడు అనుష్క శర్మ స్పెషల్ పోస్ట్

భారత స్టార్ బ్యాటర్, ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు(నవంబర్ 5). 34 ఏళ్లు పూర్తి చేసుకొని.. 35వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ తరుణంలో అతనికి క్రికెట్ ప్రముఖులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తుంటే, సహచర క్రికెటర్లు అతన్ని మనసారా హత్తుకొని విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలో అతని సతీమణి అనుష్క శర్మ తన భర్తను గొప్పగా వర్ణిస్తూ.. అతను ఓ అరుదైన ప్రత్యేక రికార్డును గుర్తు చేస్తూ విషెస్ తెలిపింది.

కోహ్లీ తన జీవితంలో ప్రతి పాత్రలో అక్షరాలా అసాధారణంగానే ఉంటాడని వర్ణించిన అనుష్క శర్మ.. జీవితమంతా తననే ప్రేమిస్తానని తెలిపింది. అలాగే, అతను సాధించిన ఓ అరుదైన రికార్డును పోస్ట్ చేసింది. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో మొదటిసారి బౌలింగ్‌ చేసిన కోహ్లీ.. తొలి బంతికే కెవిన్ పీటర్సన్‌ను ఔట్ చేశాడు. నిజానికి అది ఔటే అయినా.. ఆ బాల్ కౌంట్ అవ్వలేదు. బాల్ వైడ్ వెళ్లగా.. ధోని అతన్ని స్టంప్‌ ఔట్ చేశాడు. ఫలితంగా బాల్ లెక్కలోకి రాదు. దీంతో కోహ్లీ ఒక్క బాల్ వేయకుండానే వికెట్ సాధించిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ రికార్డును గుర్తుచేసిన అతని సతీమణి.. ఇలాంటి ఘనత తన భర్త తప్ప మరెవరూ ఇప్పటివరకూ సాధించలేదంటూ కితాబిచ్చింది.

కొన్నేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన అనుష్క, విరాట్ జోడి 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. పేరు.. వామిక. త్వరలోనే ఈ జోడి రెండో బిడ్డకు జన్మినివ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.