ఫుడ్ ఏం మ్యాజిక్ కాదు.. ఇట్స్ ఎ సైన్స్.. హైప్ పెంచుతున్న అనుష్క శెట్టి టీజర్

ఫుడ్ ఏం మ్యాజిక్ కాదు.. ఇట్స్ ఎ సైన్స్.. హైప్ పెంచుతున్న అనుష్క శెట్టి టీజర్

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘Miss. శెట్టి Mr.పొలిశెట్టి’ టీజర్ ను శనివారం (ఏప్రిల్ 29) విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ చిత్రంలో అనుష్క చెఫ్ గా, నవీన్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నారు. టీజర్ లో వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

అనుష్క గ్లామర్, నవీన్ కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కామ్ అండ్ క్లీన్ లవ్ స్టోరీలా సినిమా ఉండబోతోందని అంచనా. ఈ సినిమా పి.మహేష్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఈ మూవీలో జయసుధ, మురళీశర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.