పాకిస్తాన్ కేర్ టేకర్ ప్రధానిగా అన్వర్ -ఉల్-హక్

పాకిస్తాన్ కేర్ టేకర్ ప్రధానిగా అన్వర్ -ఉల్-హక్
  • పాక్​ కేర్ టేకర్ ప్రధానిగా అన్వర్ -ఉల్-హక్

ఇస్లామాబాద్: పాకిస్తాన్​కేర్ టేకర్ ప్రధానిగా సెనేటర్ అన్వర్- ఉల్-హక్ కాకర్ ఎంపికయ్యారు. ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్ శనివారం రెండు దఫాల చర్చల తర్వాత కాకర్​ పేరును ఖరారు చేశారు. బలూచిస్తాన్ అవామీ పార్టీ(బీఏపీ)కి చెందిన శాసన సభ్యుడు కాకర్.. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే వరకు కేర్ టేకర్ ప్రధానిగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా అపొజిషన్​ లీడర్​ రియాజ్ మాట్లాడుతూ.. చిన్న ప్రావిన్స్ నుంచి వచ్చిన నేతను కేర్ టేకర్ ప్రధానిగా ఎంపిక చేయాలని నిర్ణయించామని, కాకర్​ పేరును షెహబాజ్ సూచించగా అందరూ ఆమోదించారని తెలిపారు.