కొత్త రాజధాని : డిసెంబర్ లో విశాఖకు సీఎం జగన్

కొత్త రాజధాని : డిసెంబర్ లో విశాఖకు సీఎం జగన్

త్వరలోనే విశాఖపట్నంకు షిఫ్ట్ అవుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు. విశాఖ నుంచే పరిపాలన సాగబోతుందని చెప్పారు. సీఎం జగన్  విశాఖపట్నం మధురవాడలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అతిపెద్ద సిటీ విశాఖపట్నం అని అన్నారు. విశాఖలో పలు మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్,బెంగళూరు, మాదిరిగా విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందని చెప్పారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా ఉందని చెప్పారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్దలు ముందుకొస్తున్నాయని అన్నారు. ఎనిమిది యూనివర్శిటీలు, నాలుగు మెడికల్ కాలేజీలు,14 ఇంజనీరింగ్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి.  వైజాగ్ సిటి నుంచి ప్రతి సంవత్సరం 15 వేల మంది ఇంజనీర్లు వస్తున్నారని సీఎం జగన్ అన్నారు. 

ప్రస్తుతం విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని.. మరో రెండేళ్లలో ఎక్స్‌క్లూజివ్ సివిలియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రానుందని చెప్పారు. త్వరలోనే తాను విశాఖకు షిఫ్ట్ అవుతానని చెప్పారు. విశాఖ నుంచే పరిపాలన జరగబోతుందని అన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.  అక్టోబర్‌లోనే విశాఖకు రావాలని అనున్నామని చెప్పారు. అక్టోబర్‌ నాటికి రావాలనుకున్నానది డిసెంబర్‌కు కావొచ్చని తెలిపారు. అయితే డిసెంబర్‌‌లోపు విశాఖకు మారతానని స్పష్టం చేశారు. తాను వైజాగ్‌లోనే ఉండాలని కోరుకుంటున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు  కల్పిస్తామని చెప్పారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్న కంపెనీలకు కల్పించనున్నట్టుగా తెలిపారు. విశాఖపట్నంలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.