విశాఖలో ఇన్ఫోసిస్ ప్రారంభం... ఐటీ హబ్ గా వైజాగ్ సిటి

విశాఖలో ఇన్ఫోసిస్ ప్రారంభం... ఐటీ హబ్ గా వైజాగ్ సిటి

విశాఖకు మకాం మార్చడంపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సోమవారం ( అక్టోబర్ 16)  కీలక ప్రకటన చేశారు. ఐటీ హిల్స్‌ వద్ద ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇన్ఫోసిస్‌కు అన్ని విధాలుగా సహకరిస్తాం. డిసెంబర్‌ నాటికి తాను కూడా విశాఖకు రాబోతున్నానని సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్‌ నుంచి నేను కూడా విశాఖలోనే ఉంటానని సీఎం జగన్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అక్టోబర్ 16 సోమవారం రోజున  విశాఖపట్నంలో పర్యటించి .. పరవాడ సెజ్ లో ఫార్మా యూనిట్ ను సీఎం జగన్ ప్రారంభించారు.  ఈ ఏడాది డిసెంబర్ లో మార్పు ఉంటుందన్నారు.  డిసెంబర్ నుంచి విశాఖ నుంచే పరిసాలన కొనసాగిస్తామన్నారు.  

హైదరాబాద్‌, బెంగళూరు మాదిరిగా వైజాగ్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. వైజాగ్‌ కూడా ఐటీ హబ్‌గా మారుతుందని సీఎం జగన్ అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కూడా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ నగరానికి ఉజ్జ్వల భవిష్యత్‌ ఉందని సీఎం జగన్ అన్నారు. వైజాగ్‌ కలల నగరంగా అభివృద్ధి చెందబోతోందన్నారు. ఇన్ఫోసిస్‌ రాకతో విశాఖ మరింత వేగంగా వృద్ధి చెందుతుంది.విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్‌ అధికారులు మాట్లాడుతూ ఏపీలో హైబ్రీడ్‌ వర్కింగ్‌ మోడల్‌లో వెయ్యిమందికిపైగా ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ నిపుణులకు కొదవలేదని వ్యాఖ్యానించారు.ఒక్క ఫోన్‌ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కంపెనీలకు కల్పిస్తామని, వైజాగ్‌లో విస్తారమైన అవకాశాలున్నాయని చెప్పారు. త్వరలోనే తానూ విశాఖకు షిప్ట్‌ అవుతున్నానని స్వయంగా వెల్లడించారు.