సాక్షుల అఫిడవిట్లకు గడువివ్వండి

 సాక్షుల అఫిడవిట్లకు గడువివ్వండి
  • కేడబ్ల్యూడీటీ 2కి ఏపీ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల పంపిణీలో సాక్షుల విచారణ కోసం అఫిడవిట్ సమర్పించేందుకు నాలుగు వారాల గడువు కావాలని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యూనల్ 2 (కేడబ్ల్యూడీటీ 2)ని ఏపీ కోరింది. అందుకు అంగీకరించిన ట్రిబ్యునల్.‌‌. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు పెంచబోమని స్పష్టం చేసింది.

అదే సమయంలో విచారణకు సంబంధించి అదనపు డాక్యుమెంట్ల సమర్పణకు రెండు వారాల గడువు ఇవ్వాలని కోరిన తెలంగాణ విజ్ఞప్తిని కూడా ట్రిబ్యూనల్ అంగీకరించింది.

ఆ లోపు ఏపీ కూడా అదనపు డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే సమర్పించాలని సూచించింది. ఇప్పటికే‌‌ ఏవైనా అదనపు డాక్యుమెంట్లని సమర్పించి ఉంటే పది రోజుల్లో రిజిస్ట్రీలో నమోదు చేయించాలని తెలిపింది. నవంబర్ 6 నుంచి 8 వరకు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తామని స్పష్టం చేసింది.