ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేలో వైఎస్ఆర్ రైతు భరోసా సొమ్మును మే నెలలో విడుదల చేయనుంది. ఈ క్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాల శాఖల ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 24 (సోమవారం)న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే అర్హులైన రైతులకు మే నెలలో వైఎస్సార్ రైతు భరోసా విడత పంపిణీ చేసేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఇప్పుడు చెల్లించాల్సిన 33 కోట్ల రూపాయిలను ను రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
ఖరీఫ్ వరి పంటను సాగు చేసేందుకు రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు యాప్ ను రూపొందించారు. రబీ వరి కొనుగోలు చేసే సమయంలో రైతులకు ధరలు పెరిగే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.