పుట్టపర్తి: కొత్త చెరువు స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ... పాఠాలు చెప్పిన సీఎం చంద్రబాబు

పుట్టపర్తి: కొత్త చెరువు స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ... పాఠాలు చెప్పిన సీఎం చంద్రబాబు

పుట్టపర్తిలోని కొత్తచెరువు జెడ్పీ స్కూల్ లో   జరిగిన  మెగా పేరెంట్ టీచర్ మీటింగ్   కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.  విద్యార్థులతో పాటు మంత్రి లోకేష్​ కూర్చొని విద్యావ్యవస్థ గురించి చర్చించారు.  సీఎం చంద్రబాబు వనరులు అనే అంశాన్ని వివరిస్తూ స్టూడెంట్స్​ కు క్లాస్​ చెప్పారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు పాఠం చెప్పే సమయంలో క్లాస్​ లో మంత్రి లోకేష్​ కూడా ఉన్నారు. 

అనంతరం విద్యార్థుల ప్రోగ్రెస్​ కార్డులను సీఎం.. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పనీతీరు.. సౌకర్యాల గురించి ఆరా తీశారు. విద్యాశాఖా మంత్రిగా లోకేష్​ పనితీరు పట్ల కితాబిచ్చిన సీఎం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఫొటో దిగారు. 

ALSO READ : ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం..

స్కూలు క్యాంపస్ ను పరిశీలించిన చంద్రబాబు.. క్యాంపస్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తోంది.పాఠశాల ఆవరణలో విద్యార్థులు, వార తల్లిదండ్రులతో చంద్రబాబు మాట్లాడుతూ.. విద్యార్థులు చిత్రించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను మంత్రి నారా లోకేశ్ తో కలిసి తిలకించారు.