చంద్రబాబు అంటే  గుర్తొచ్చేది వెన్నుపోటు : సీఎం జగన్​

చంద్రబాబు అంటే  గుర్తొచ్చేది వెన్నుపోటు : సీఎం జగన్​

చంద్రబాబు అంటే గుర్తొచ్చేది వెన్నుపోటంటూ .. అసెంబ్లీ సమావేశాల్లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్దిని చెబుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబును విమర్శించారు.   చంద్రబాబు పేరు చెబితే ఏ సంక్షేమ పథకమైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. అన్ని సామాజిక వర్గాలను మోసం చేసి.. ఇప్పుడు మళ్లీ ఒక్క అవకాశం ఇమ్మని అడుగుతున్నారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంచేశారని ప్రశ్నించారు.  చంద్రబాబు ఆయన మామగారైన ఎన్టీఆర్​ను వెన్నుపోటు పొడిచి సీఎం సీట్లో కూర్చొన్నారని సీఎం జగన్ అన్నారు. 

చంద్రబాబు కొత్త కొత్త వాగ్ధానాలతో మళ్లీ మోసం చేయడానికి సిద్దమయ్యారని అసెంబ్లీలో సీఎం జగన్​ అన్నారు. ఏపీ ప్రజలను మోసం చేసేందుకు జాతీయ పార్టీలతో అవగాహన కుదుర్చుకొని కుట్రలు, కుతంత్రాలు, పొత్తులు పెట్టుకుంటున్నారన్నారు.  650 హామీలిస్తే 10 శాతం కూడా అమలు చేయలేదంటూ...  ఎన్నికల తరువాత మ్యానిఫెస్టో చెత్తబుట్టలోకి వెళతుందని... చంద్రబాబు మోసం చేసేందుకు  మళ్లీ రంగు రంగుల మ్యానిఫెస్టోను తీసుకొచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్దమయ్యారని సీఎం జగన్​ అన్నారు.