ఆయన ఏది ముట్టుకున్నా స్కామే.. చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

ఆయన ఏది ముట్టుకున్నా స్కామే.. చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

ఏపీ సీఎం జగన్ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ రోజు ( నవంబర్ 7) పర్యటించారు.  రైతు భరోసా విడుదల చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కామేనని ఫైర్ అయ్యారు. రైతులు ఇబ్బంది పడకూడదనే ముందుగా మనీ ఇస్తున్నామన్న జగన్.. చంద్రబాబు హయాంలో ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందని ప్రశ్నించారు. స్కీంల గురించి కాకుండా, స్కాముల గురించే చంద్రబాబు ఆలోచించారని జగన్ మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెండ్, ఫైబర్ గ్రిడ్, మద్యం అన్నీ స్కాములే చేశారని అన్నారు.

వ్యవసాయం, చదువులు, ఆరోగ్య రంగం.. ఏది తీసుకున్నా కనీ వినీ ఎరుగని మార్పులు తెచ్చామన్న జగన్… అన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తెచ్చామన్నారు. మీ బిడ్డ ప్రభుత్వం మీ ఇంట్లో మేలు చేసినట్లు అనిపిస్తేనే, వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని జగన్ కోరారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలను నమ్మొద్దని కోరారు.

ALSO READ : గెట్ వెల్ సూన్ : కంటి ఆపరేషన్ తర్వాత చంద్రబాబు