
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో మంగళవారం ( నవంబర్ 7) శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటల సేపు కొనసాగింది. శస్త్ర చికిత్స ముగిసిన వెంటనే ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి బయల్దేరారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టిడిపి ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల టిడిపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో చంద్రబాబు ఎడమ కంటికి సర్జరీ చేయించుకున్నారు. ఈ మేరకు ఇవాళ ( నవంబర్ 7) కుడి కంటికి శస్త్ర చికిత్స జరిగింది.
Also Read :-ఆ కేసులో చంద్రబాబుకు ఊరట: అప్పటి వరకు అరెస్ట్ చేయబోమన్న సీఐడీ