సీఎం జగన్ హిందువు కాదు.. ఓ క్రైస్తవుడు

సీఎం జగన్ హిందువు కాదు.. ఓ క్రైస్తవుడు

జగన్ హిందువు కాదు.. ఓ క్రైస్తవుడని స్వామి పరిపూర్ణానంద అన్నారు. హిందూ సమాజానికి మంచి చేస్తానని జగన్ స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోదని‌... దాన్ని ఆచరణలో పెట్టాలని ఆయన అన్నారు. ‘రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులైనా సీమకు గుర్తింపు తేలేకపోయారు. రాయలసీమని జాతీయస్థాయిలో నిలబెట్టడంలో విఫలమయ్యారు. రాయలసీమని ప్రపంచపటంలో ఓ క్షేత్రంగా నిలబెట్టాలంటే మార్పు అవసరం. పార్టీల గురించి మాట్లాడటానికి నేను రాలేదు. వివాదాలకి కేరాఫ్ అడ్రస్‌గా తిరుపతి మారుతోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక ఆరోపణలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడటం లేదు. అన్యమతం గురించి అనేక మంది మొత్తుకుంటున్నా ఎందుకు నోరు మెదపడం లేదు. టీటీడీని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్‌లోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు. టీటీడీ ఆస్తులపై ఓ శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి. రాష్ట్రంలో 350 దేవాలయాలు కూలినా జగన్ పట్టించుకోలేదు. వీటన్నింటిపైనా జగన్ సమాదానం చెప్పాలి. ఆ తరువాత తిరుపతి వచ్చి ఓట్లు అడగాలి. జగన్ హిందువు కాదు.. ఓ క్రైస్తవుడు. హిందూ సమాజానికి మంచి చేస్తానని స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోదు‌.. ఆచరణలో పెట్టాలి. కులాలను పక్కన పెట్టి అభివృద్ధికి ఓటెయ్యండి. రాయలసీమను రతనాలసీమగా మార్చాలంటే బీజేపీకి ఓటు వెయ్యాల్సిన అవసరం ఉంది. దానికి నేను కట్టుబడి ఉన్నాను’ అని స్వామి పరిపూర్ణానంద అన్నారు.