భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఏయిర్ పోర్టుకు మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు 2,200 ఎకరాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుంది. శంకుస్థాపన చేసిన నాటి నుంచి పనులు ప్రారంభించి 24 నుంచి 30 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. . నిర్మాణ బాధ్యతలను జీఎంఆర్ సంస్థ తీసుకుంటుందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. , ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. భోగాపురం మండలం ఎ.రావివలస, సవరవిల్లి గ్రామాల సమీపంలో విమానాశ్రయానికి శంకుస్థాపన, అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.
భోగాపురం ఎయిర్ పోర్టు విజయనగరం జిల్లాలో రానుంది. విశాఖపట్నానికి ఈశాన్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భోగాపురం వద్ద నిర్మించనున్నారు. విజయనగరం నుండి 25 కిలోమీటర్ల దూరంలో... శ్రీకాకుళంకు 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం ప్రధానంగా ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతానికి సేవలు అందిస్తుంది. ఈ ప్రాంతంలో ఉపాధికి ప్రధాన వనరుగా ఈ ఎయిర్ పోర్టును భావిస్తున్నారు. ఈ ప్రాంతం ప్రస్తుతం జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 26 ద్వారా, భవిష్యత్తులో వైజాగ్ బీచ్ కారిడార్, వైజాగ్ మెట్రో ద్వారా నిర్మించనున్న విమానాశ్రయానికి అనుసంధానం అవుతుందని భావిస్తున్నారు..