ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు

ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పదవీ కాలం పొడిగించారు. ఈనెలాఖరుతో పదవీవిరమణ చేయాల్సిన ఆయన పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  సీఎస్ సమీర్‌ శర్మ పదవీకాలం పొడిగించడానికి  అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సర్వీస్‌ను పొడిగించడంతో సమీర్‌ శర్మ వచ్చే ఏడాది 2022 మే 31వ తేదీ వరకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు.