ట్యాక్స్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏపీ దహిమా

ట్యాక్స్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏపీ దహిమా

బషీర్‌బాగ్, వెలుగు : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఒక హోటల్‌లో అసోసియేషన్ 55వ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. సంస్థ మాజీ అధ్యక్షుడు సీఏ చంద్రశేఖర్ వేముల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని  ప్రకటించారు.ఎన్నికల పరిశీలకులు సీఏ రామ్‌దేవ్ భుటాడా, సీఏ అమృత్ కుమార్ కోట సమక్షంలో ఎన్నికల అధికారి సీఏ హితేష్ జైన్ నూతన కమిటీ వివరాలను వెల్లడించారు.

అధ్యక్షుడిగా ఐటీపీ ఏపీ దహిమా, ఉపాధ్యక్షుడిగా సీఏ కె. ఆదినారాయణ కోట, కార్యదర్శిగా సీఏ పీవీ నారాయణ రావు, సంయుక్త కార్యదర్శిగా సీఏ నాగ ప్రవల్లిక వేముల, కోశాధికారిగా సీఏ పంకజ్ సంచేటిని ఎన్నుకున్నారు. అడ్వొకేట్ ఎన్. వి. చారి, అడ్వొకేట్ సోమేశ్వర్ నెమ్మాని, సీఏ ప్రకాష్ చోక్డా, సీఏ శైలేందర్ శర్మ, సీఏ పంకజ్ చందక్, సీఏ లీలా కృష్ణ మోహన్, సీఏ ఆశిష్ జోషిలు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ వేముల 2025–26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. అసోసియేషన్ నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, సాధించిన విజయాలను వివరించారు.