తెలంగాణలో ఎన్నికలు : ఏపీ ఉద్యోగులకు సెలవు

తెలంగాణలో ఎన్నికలు : ఏపీ ఉద్యోగులకు సెలవు

 తెలంగాణలో గురువారం (నవంబర్30) జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు అందరికీ కాదని స్పష్టం చేసింది. ఏపీలో ఉద్యోగం చేస్తూ తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునే వారికి వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం వినతి మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సెలవు మంజూరు చేశారు. 

తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు సరైన ఆధారాలు చూపించి సెలవు పొందవచ్చని సూచించింది. గురువారం(నవంబర్30)  తెలంగాణలోని 33 జిల్లాలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో అనేక మంది ఉద్యోగులు ఇరు జిల్లాలో పనిచేస్తున్నందున ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.